Ad litePremium ar...Ad litePremium ar...ధన త్రయోదశికి ఒక్క రోజు ముందే తులా రాశిలో సూర్య సంచారం.. అక్టోబర్ 17 నుండి ఈ మూడు రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది! | Hindustan Times Telugu

ధన త్రయోదశికి ఒక్క రోజు ముందే తులా రాశిలో సూర్య సంచారం.. అక్టోబర్ 17 నుండి ఈ మూడు రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది!

గ్రహాలకి రాజు సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు రాశి మార్పు చేసినప్పుడు ఆ ప్రభావం ద్వాదశ రాశుల వారిపై చూపిస్తుంది. సూర్యుడు రాశి మార్పు చేసినప్పుడు అనేక విధాలుగా మార్పులను చూస్తారు. ధన త్రయోదశికు ఒక రోజు ముందు అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు.

Published on: Oct 15, 2025 12:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా రాశి మార్పు చెందినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. గ్రహాలకి రాజు అయినటువంటి సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు ఇలా రాశి మార్పు చేసినప్పుడు ఆ ప్రభావం ద్వాదశ రాశుల వారిపై చూపిస్తుంది.

ధన త్రయోదశికి ఒక్క రోజు ముందే తులా రాశిలో సూర్య సంచారం (pinterest)
ధన త్రయోదశికి ఒక్క రోజు ముందే తులా రాశిలో సూర్య సంచారం (pinterest)

సూర్యుడు రాశి మార్పు చేసినప్పుడు అనేక విధాలుగా మార్పులను చూస్తారు. ఒక్కోసారి గ్రహాల మార్పు అశుభ ఫలితాలను కూడా కలిగిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దుష్ప్రభావాలను ఎదుర్కోక తప్పదు. సూర్యుడు రాశి మార్పు చేసినప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు రెండూ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురైతే, కొన్ని రాశుల వారు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

తులా రాశిలో సూర్య సంచారం

దీపావళి, ధన త్రయోదశి, నరక చతుర్దశి త్వరలోనే రాబోతున్నాయి. ధన త్రయోదశికు ఒక రోజు ముందు అంటే అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం సూర్యుడు కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు.

అక్టోబర్ 17న తులా రాశిలోకి ప్రవేశించి, నెల రోజుల పాటు అదే రాశిలో సంచారం చేస్తాడు. దీంతో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. మరి ఏ రాశుల వారికి సూర్య సంచారం శుభ ఫలితాలను తీసుకురాబోతోందో, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

తులా రాశిలోకి సూర్యుడు, ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు

1. కర్కాటక రాశి:

సూర్య రాశిలో మార్పు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆనందాలు పెరుగుతాయి. భూమి, భవనం మరియు వాహనం కొనుగోలు చేసే సంకేతాలు ఉన్నాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. వివాదాల పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉంటుంది.

2. తులా రాశి:

సూర్య రాశి మార్పు తులా రాశి వారికి మంచిది. సూర్యుడు సంచారంలో మార్పు రావడంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగార్ధులు మంచి ఉద్యోగ మార్పులను పొందుతారు. ఆర్థిక లాభాలు జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తాయి.

3. ధనుస్సు రాశి:

సూర్య సంచారం ధనుస్సు రాశికి మంచిది. ఈ సమయంలో, మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. డబ్బు కూడా పాత వనరు నుండి వస్తుంది. పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు పదోన్నతులు పొందవచ్చు. వ్యాపార పరిస్థితులు బలంగా ఉంటాయి.

News/Rasi Phalalu/ధన త్రయోదశికి ఒక్క రోజు ముందే తులా రాశిలో సూర్య సంచారం.. అక్టోబర్ 17 నుండి ఈ మూడు రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది!
News/Rasi Phalalu/ధన త్రయోదశికి ఒక్క రోజు ముందే తులా రాశిలో సూర్య సంచారం.. అక్టోబర్ 17 నుండి ఈ మూడు రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది!