Ad litePremium ar...Ad litePremium ar...రామ ఏకాదశి ఎప్పుడు? అక్టోబరు 16న, 17న? రామ ఏకాదశి పూజా విధానం, శుభ సమయం, పాటించాల్సిన పరిహారాలతో పాటు పూర్తి వివరాలు! | Hindustan Times Telugu

రామ ఏకాదశి ఎప్పుడు? అక్టోబరు 16న, 17న? రామ ఏకాదశి పూజా విధానం, శుభ సమయం, పాటించాల్సిన పరిహారాలతో పాటు పూర్తి వివరాలు!

పూర్ణ ఏకాదశి ఉన్న రోజున ఏకాదశి వ్రతాన్ని జరుపుతారు. స్కంద పురాణంలో కూడా వర్ణించబడింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు విరమించాలి. త్రయోదశితో ముడిపడి ఉన్న ద్వాదశిని శుభప్రదమైనదిగా భావిస్తారు. రామ ఏకాదశి పూజా విధానం, శుభ సమయం, పాటించాల్సిన పరిహారాలతో పాటు పూర్తి వివరాలు ఇవిగో.

Published on: Oct 16, 2025 10:30 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతీ ఏటా రామ ఏకాదశిని ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఏకాదశి నాడు దశమి లేకుండా పూర్ణ ఏకాదశి ఉన్న రోజున ఏకాదశి వ్రతాన్ని జరుపుతారు. ఈ విషయాం స్కంద పురాణంలో కూడా వర్ణించబడింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, ద్వాదశి నాడు విరమించాలి. త్రయోదశితో ముడిపడి ఉన్న ద్వాదశిని శుభప్రదమైనదిగా భావిస్తారు. ఆ రోజున ఉపవాసం విచ్ఛిన్నం చేయడం కూడా ఉత్తమం.

ఈ ఏడాది రామ ఏకాదశి ఎప్పుడు వచ్చింది?
ఈ ఏడాది రామ ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

ఈ ఏడాది రామ ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

రామ ఏకాదశి శుక్రవారం, అక్టోబర్ 17, 2025న వచ్చింది. వాస్తవానికి, ఈసారి ఏకాదశి తేదీ అక్టోబర్ 16, 2025 న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 17, 2025న ఉదయం 11:12 గంటలకు ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 17న ఏకాదశి ఉపవాసం ఉండాలి. ఇది అక్టోబర్ 18న విరమించాలి.

రామ ఏకాదశి రోజున ఏం చేయాలి?

రామ ఏకాదశి రోజున తులసిమాతను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున తులసి మంజరిని విష్ణుమూర్తికి సమర్పించాలని చెబుతారు. ఇది విష్ణుమూర్తిని సంతోషపరుస్తుంది. ఏకాదశి రోజున ఉసిరిని పూజిస్తే మోక్షాన్ని పొందవచ్చని కూడా చెబుతారు. లక్ష్మిని పొందాలనుకునే వ్యక్తి ఉసిరితో స్నానం చేయాలి. ముఖ్యంగా ఏకాదశి రోజున ఇలా చేస్తే విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడు. ఉసిరి నీడలో కూర్చుని పిండ దానం చేసే వ్యక్తి పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు ఉసిరి చెట్టు కింద కూర్చుని ఆహారం తినడం, బ్రాహ్మణుడికి ఆహారం పంచిపెట్టడం కూడా మంచిదే.

రామ ఏకాదశి శుభ సమయం

బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:43 నుండి 05:33 వరకు

ఉదయం సంధ్య- ఉదయం 05:08 నుండి 06:23 వరకు

అభిజిత్ ముహూర్తం - ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:29 వరకు

విజయ ముహూర్తం- మధ్యాహ్నం 02:01 నుండి 02:46 వరకు

రామ ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన పరిహారాలు

  1. రామ ఏకాదశి రోజున ఉదయాన్నే లేవాలి. మీ మనస్సులో విష్ణుమూర్తిని స్మరించుకోండి.
  2. స్నానం చేసిన తరువాత శుభ్రమైన దుస్తులను ధరించండి.
  3. పూజ గదిని శుభ్రం చేసి, విష్ణువు ముందు దీపం వెలిగించండి. విష్ణుమూర్తికి పండ్లు, పువ్వులు, ధూపదీప నైవేద్యాలను సమర్పించండి.
  4. విష్ణు చాలీసా మరియు మంత్రాలను జపించండి. హారతి ఇవ్వండి.

డబ్బు సంపాదించే మార్గాలు:

రామ ఏకాదశి రోజున తులసి విత్తనాలను తీసి బీరువాలో లేదా పర్సులో పెట్టండి. ఇలా చేస్తే డబ్బు కొరతను తొలగిస్తుంది, ఇంటికి సంవృద్ధిని తెస్తుందని నమ్ముతారు.

ఆనందం మరియు శ్రేయస్సు కోసం ఇలా చెయ్యండి:

రామ ఏకాదశి రోజున, తులసి మొక్కలో శాలిగ్రామాన్ని ప్రతిష్టించి పూజించండి. అలా చేయడం వల్ల సంపద పెరుగుతుందని పండితులు తెలిపారు.

News/Rasi Phalalu/రామ ఏకాదశి ఎప్పుడు? అక్టోబరు 16న, 17న? రామ ఏకాదశి పూజా విధానం, శుభ సమయం, పాటించాల్సిన పరిహారాలతో పాటు పూర్తి వివరాలు!
News/Rasi Phalalu/రామ ఏకాదశి ఎప్పుడు? అక్టోబరు 16న, 17న? రామ ఏకాదశి పూజా విధానం, శుభ సమయం, పాటించాల్సిన పరిహారాలతో పాటు పూర్తి వివరాలు!