Ad litePremium ar...Ad litePremium ar...లక్ష్మీ కటాక్షం కలగంటే దీపావళికి ముందు ఈ ఐదింటిని ఇంట్లో పెట్టండి.. ఇక కాసుల వర్షం కురిసినట్టే! | Hindustan Times Telugu

లక్ష్మీ కటాక్షం కలగంటే దీపావళికి ముందు ఈ ఐదింటిని ఇంట్లో పెట్టండి.. ఇక కాసుల వర్షం కురిసినట్టే!

దీపావళి వచ్చేస్తోంది. ఇప్పటికే అందరూ ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టి ఉంటారు. దీపావళి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. దీపావళి నాడు లక్ష్మీకటాక్షం కలగాలంటే దీపావళికి ముందు ఏ వస్తువులను ఇంటికి తెచ్చిపెట్టాలో తెలుసుకోవాలి.

Published on: Oct 15, 2025 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి పండుగ కూడా ఒకటి. దీపావళి నాడు పెద్దలు, పిల్లలు కూడా సంతోషంగా పండుగను జరుపుకుంటారు. దీపావళి వచ్చేస్తోంది. ఇప్పటికే అందరూ ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టి ఉంటారు. ఇంటి పనులు చేసుకోవడంతో పాటుగా షాపింగ్ పనులు కూడా చేసుకోవడం మొదలుపెట్టాలి, ఎందుకంటే కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది.

దీపావళి నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే వీటిని ఇంటికి తీసుకురండి (pinterest)
దీపావళి నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే వీటిని ఇంటికి తీసుకురండి (pinterest)

దీపావళి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కలిగి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. దీపావళి నాడు లక్ష్మీకటాక్షం కలగాలంటే దీపావళికి ముందు ఏ వస్తువులను ఇంటికి తెచ్చిపెట్టాలో తెలుసుకోవాలి. ఇవి ఇంటికి తీసుకురావడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి.

దీపావళి 2025

దీపావళి పండుగని అద్భుతంగా, ఆనందంగా జరుపుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలను తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంటిని అలంకరించడం, కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం లాంటివి చేయాలి. వీటిని పాటించడం వలన శ్రేయస్సు కలుగుతుంది, సానుకూలత ఉంటుంది, అదృష్టం కూడా కలిసి వస్తుంది.

దీపావళికి ముందు ఎలాంటి వస్తువులను ఇంటికి తెచ్చిపెట్టాలి, వేటి వలన అదృష్టం కలిసి వస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఏం చేయాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే వీటిని ఇంటికి తీసుకురండి:

దీపావళి నాడు లక్ష్మీకటాక్షం కలగాలంటే కొన్ని వస్తువులను ఇంటికి తీసుకు రావాలి. దీపావళికి ముందే వీటిని ఇంటికి తెచ్చిపెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సానుకూల శక్తి వ్యాపిస్తుంది, అనేక విధాలుగా శుభ ఫలితాలు ఎదురవుతాయి.

1.తాబేలు:

దీపావళికి ముందు ఇంటికి ఒక తాబేలు తెచ్చిపెట్టండి. లోహ తాబేలును ఇంటికి తీసుకు రావడం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఇది విష్ణువు, లక్ష్మీదేవి నుంచి సానుకూల శక్తిని పొందడానికి సహాయపడుతుంది.

2.కొబ్బరికాయలు:

కొబ్బరికాయను లక్ష్మీదేవి చిహ్నాలలో ఒకటిగా భావిస్తారు. కొబ్బరికాయను కూడా దీపావళికి ముందు ఇంటికి తీసుకురండి. దీంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. కొబ్బరికాయను పూజ గదిలో పెట్టండి. ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహం పక్కన పెడితే వాస్తు దోషాలు తొలగిపోతాయి, సంపద కూడా పెరుగుతుంది.

3.శ్రీ యంత్రం:

దీపావళికి ముందు ఇంటికి శ్రీ యంత్రాన్ని తీసుకురండి. సంపద కలిగి సంతోషంగా ఉండొచ్చు. కెరీర్‌లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. పూజ గదిలో శ్రీ యంత్రాన్ని తీసుకువచ్చి తూర్పు లేదా ఉత్తర వైపున పెట్టండి. దీంతో చక్కటి మార్పును చూస్తారు.

4.తులసి మొక్క:

హిందువులు తులసి మొక్కను పూజిస్తారు. దీపావళికి ముందు ఇంటికి తులసి మొక్కను తీసుకురావడం వలన పర్యావరణం శుద్ధి అవుతుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది, ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి.

5.లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలు:

దీపావళి నాడు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తారు. ఈ రెండు విగ్రహాలను దీపావళికి ముందు ఇంటికి తీసుకురావడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి, సంపద కూడా పెరుగుతుంది.

News/Rasi Phalalu/లక్ష్మీ కటాక్షం కలగంటే దీపావళికి ముందు ఈ ఐదింటిని ఇంట్లో పెట్టండి.. ఇక కాసుల వర్షం కురిసినట్టే!
News/Rasi Phalalu/లక్ష్మీ కటాక్షం కలగంటే దీపావళికి ముందు ఈ ఐదింటిని ఇంట్లో పెట్టండి.. ఇక కాసుల వర్షం కురిసినట్టే!