Ad litePremium ar...Ad litePremium ar...గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లాలను ఎత్తుకొని తిరిగిన బాలు, రవి, మనోజ్.. ముచ్చటపడిన ప్రభావతి | Hindustan Times Telugu

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లాలను ఎత్తుకొని తిరిగిన బాలు, రవి, మనోజ్.. ముచ్చటపడిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మాణిక్యాన్ని ఇరికించడానికి బాలు, మీనా ప్లాన్ చేస్తే.. అంతకుముందే రోహిణి మరో కొత్త నాటకం ఆడుతుంది. ఇక ఎపిసోడ్ చివర్లో అందరూ పెళ్లాలను ఎత్తుకొని తిరగడం ఈ ఎపిసోడ్ హైలైట్.

Published on: Oct 16, 2025 8:06 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం రోహిణి, మాణిక్యంతోపాటు చివర్లో ఇంట్లో ముగ్గురు కొడుకులు తమ భార్యలను ఎత్తుకుని తిరిగే సీన్లో సాగిపోయింది. అయితే ఎపిసోడ్ చివర్లో ఇంట్లో ఎవరు ఎంతివ్వాలో చెబుతూ సత్యం లెక్కలు వేయడం విశేషం. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లాలను ఎత్తుకొని తిరిగిన బాలు, రవి, మనోజ్.. ముచ్చటపడిన ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లాలను ఎత్తుకొని తిరిగిన బాలు, రవి, మనోజ్.. ముచ్చటపడిన ప్రభావతి

బాలు, మీనా మాటలు విన్న రోహిణి

గుండె నిండా గుడి గంటలు గురువారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ మొదట్లోనే మాణిక్యాన్ని తాను రాజమండ్రిలోనే చూసినట్లు బాలుతో మీనా చెబుతుంది. ఇంతలో వాళ్ల మాటలను రోహిణి బయటి నుంచి వింటుంది. పార్లరమ్మ మొదటి నుంచీ అనుమానంగానే వ్యవహరిస్తోందని, ఇప్పటి వరకూ తండ్రిని చూపించలేదని బాలు అంటాడు.

మాణిక్యం ఇక్కడే ఉన్నాడని తాను నిరూపిస్తానని, అతనితో తాను దిగిన ఫొటోను గ్రూపులో షేర్ చేసి తమ వాళ్లందరికీ అతడు ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలని అడుగుతానని బాలు అంటాడు. ఆ మాటలు విని రోహిణి కంగారు పడుతుంది. కొత్త నాటకానికి తెరతీస్తుంది.

రోహిణి కొత్త నాటకం.. మాణిక్యానికి వీడియో కాల్

మాణిక్యంపై డౌట్ రావడంతో రోహిణి కొత్త నాటకం మొదలుపెడుతుంది. అతనికి తానే వీడియో కాల్ చేస్తుంది. దుబాయ్ లో ఉన్నట్లుగా చెబుతుంది. అతడు కూడా తాను ప్రస్తుతం దుబాయ్ లో బిజినెస్ చేస్తున్నట్లు మాణిక్యం చెబుతాడు. అయితే అతడు అక్కడ కూడా మేక భాషలోనే మాట్లాడుతుంటాడు. దీంతో రవి, బాలులకు మరింత అనుమానం వస్తుంది. ఎక్కడున్నావంటే దుబాయ్ లో ఉన్నానని అనడంతో ప్రభావతి ఎంతో ఆనందంగా ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. రోహిణి వాళ్ల నాన్న బయటకు ఎప్పుడు వస్తారని అడిగితే.. నెల రోజుల్లోనే వస్తాడని అతడు అనడంతో రోహిణి లోపల తిట్టుకుంటుంది.

మాణిక్యాన్ని ఇరికించిన బాలు

బాలు ఫోన్ తీసుకొని మాణిక్యాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. దుబాయ్ లో ఎక్కుడున్నారు.. అక్కడ కూడా సిటీలు ఉంటాయి కదా.. ఒకసారి లొకేషన్ పంపిస్తే మా డబ్బుడమ్మ చూసి చెబుతుంది అని అంటాడు. దీంతో మాణిక్యం కంగారు పడతాడు. అటు రోహిణి కూడా వెంటనే బాలు చేతుల్లో నుంచి ఫోన్ లాక్కుంటుంది. ఏదో కవర్ చేసి ఫోన్ పెట్టేస్తుంది.

బాలులో మరింత పెరిగిన అనుమానం

అయితే ఫోన్ పెట్టేసిన తర్వాత బాలులో మరింత అనుమానం పెరుగుతుంది. మీనా అనుమానం నిజమే అని, మాణిక్యం ఇక్కడే ఉన్నాడని బాలు అంటాడు. లేకపోతే ఇన్నాళ్లుగా చేయని ఫోన్ ఇప్పుడు ఎందుకు చేస్తాడు.. దుబాయ్ లో ఎక్కడున్నావని అడిగితే ఎందుకు చెప్పడు అని మీనాతో బాలు అంటాడు. మాణిక్యం ఇక్కడే ఉన్నాడని తాను నిరూపిస్తానని స్పష్టం చేస్తాడు.

అటు మనోజ్ లోనూ అనుమానం మొదలవుతుంది. అదే విషయం రోహిణిని అడుగుతాడు. అతడు మాట్లాడే మాటలు అర్థం కాలేదు.. దుబాయ్ లో ఎందుకు ఉన్నాడు.. రూ.25 లక్షలు అతడు ఇచ్చాడని చెబుతాడేంటి.. మరో రూ.5 లక్షలు ఇస్తాడంటాడేంటి అని అడుగుతాడు. దీంతో రోహిణి ఎదురు తిరిగి అతనికే క్లాస్ పీకి వెళ్లిపోతుంది.

అటు తన ప్లాన్ సక్సెస్ కావడంతో మాణిక్యం దగ్గరికి వెళ్లి రోహిణి థ్యాంక్స్ చెబుతుంది. అయితే అతడు మాత్రం పదే పదే అబద్ధం ఆడితే ఎప్పుడో ఒకసారి బయటపడుతుందని రోహిణికి మాణిక్యం వార్నింగ్ ఇస్తాడు.

పెళ్లాలను ఎత్తుకొని తిరిగిన రవి, బాలు, మనోజ్

ఇక ఈ ఎపిసోడ్ చివర్లో రవి, బాలు, మనోజ్ తమ పెళ్లాలను ఎత్తుకొని తిరగడం విశేషం. మొదట శృతి ఓ వీడియోను రవికి చూపిస్తూ నీకు కూడా ప్రేమ ఉంటే అలా ఎత్తుకొని తిరగాలని అంటుంది. సరే అని శృతిని రవి ఎత్తుకుంటాడు. వాళ్లను చూసిన మీనా కూడా అలా చేయమనడంతో బాలు సరే అంటాడు. చివరికి మనోజ్ కూడా రోహిణిని ఎత్తుకొని తిరుగుతాడు. ఇది చూసి ప్రభావతి వాళ్లను తిడుతుంది.

చివరికి ఇంటి ఖర్చుల కోసం అందరినీ సత్యం డబ్బులు అడగడం విశేషం. మనోజ్ తాను రూ.8 వేలు ఇస్తాననగా.. బాలు రూ.10 వేలు, రవి రూ.10 వేలు ఇస్తామంటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

News/Entertainment/గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లాలను ఎత్తుకొని తిరిగిన బాలు, రవి, మనోజ్.. ముచ్చటపడిన ప్రభావతి
News/Entertainment/గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: పెళ్లాలను ఎత్తుకొని తిరిగిన బాలు, రవి, మనోజ్.. ముచ్చటపడిన ప్రభావతి