Ad litePremium ar...Ad litePremium ar...ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ మూవీస్ ఇవే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందినవే 6.. వీటిని చూశారా లేదా? | Hindustan Times Telugu

ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ మూవీస్ ఇవే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందినవే 6.. వీటిని చూశారా లేదా?

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అక్టోబర్ 1 నుంచి 15 మధ్యే ఎన్నో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. వాటిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందిన ఈ 6 సినిమాలను మిస్ కాకుండా చూడండి.

Published on: Oct 15, 2025 10:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అక్టోబర్ తొలి రెండు వారాల్లో ఎన్నో సినిమాలు క్యూ కట్టాయి. వాటిలో కొన్ని బ్లాక్‌బస్టర్లు, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. తమ ప్లాట్‌ఫామ్ లోకి ఈ మధ్యే వచ్చిన లేటెస్ట్ సినిమాల జాబితాను ప్రైమ్ వీడియో తాజాగా రిలీజ్ చేసింది. మరి వీటిలో ఈ 6 సినిమాలను మీరు చూశారో లేదో చెక్ చేసుకోండి.

ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ మూవీస్ ఇవే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందినవే 6.. వీటిని చూశారా లేదా?
ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ మూవీస్ ఇవే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందినవే 6.. వీటిని చూశారా లేదా?

మదరాసి

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన మరో హిట్ మూవీ మదరాసి. ఈ సినిమా ఈ నెలలోనే ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. తమిళంతోపాటు తెలుగు, హిందీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మూవీ ఇది. నిజానికి రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు వసూళ్ల పరంగా నష్టాలు వచ్చినా.. సినిమాకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది.

త్రిబాణధారి బార్బారిక్

తెలుగు, తమిళ సినిమా త్రిబాణధారి బార్బారిక్ కూడా ఈ నెలలోనే ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. సత్యరాజ్ నటించిన సోషియో ఫ్యాంటసీ మూవీ ఇది. ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అంతంతమాత్రం రెస్పాన్సే వచ్చింది.

బాంబ్ - తమిళం

ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే బాంబ్ అనే తమిళం సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇదో సోషల్ డ్రామా. దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి మరణించడం, ఆ శవం నుంచి పిత్తులు రావడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే తన ఫ్రెండ్ బతికే ఉన్నాడని మరో వ్యక్తి నమ్ముతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ బాంబ్ సినిమాలో చూడొచ్చు.

మైనే ప్యార్ కియా - మలయాళం

మలయాళం మూవీ మైనే ప్యార్ కియా ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఉన్నిక్కుళం అనే ఊళ్లో జరిగే స్టోరీ ఇది. కన్నప్ప హీరోయిన ప్రీతి ముకుందన్ నటించిన సినిమా ఇది.

రిప్పన్ స్వామి - కన్నడ

కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా రిప్పన్ స్వామి కూడా ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సంతోష్ అనే ఓ మాంసం కొట్టు యజమాని హత్య చుట్టూ తిరుగుతుంది. ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఈ మధ్యే ప్రైమ్ వీడియోలోకి వచ్చింది.

గాంధీ కన్నడి - తమిళం

తమిళ కామెడీ డ్రామా గాంధీ కన్నడి అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఓ ఈవెంట్ ప్లానర్ ఓ వృద్ధుడి 60వ పెళ్లి రోజును సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. అదే అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఆరు సినిమాలు అక్టోబర్ 1 నుంచి 15 మధ్య ప్రైమ్ వీడియోలోకి వచ్చాయి. మరి వీటిని ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే వెంటనే ప్లాన్ చేసేయండి.

News/Entertainment/ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ మూవీస్ ఇవే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందినవే 6.. వీటిని చూశారా లేదా?
News/Entertainment/ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే వచ్చిన టాప్ మూవీస్ ఇవే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు చెందినవే 6.. వీటిని చూశారా లేదా?