చికెన్ దుకాణాలకు లైసెన్స్.. ఎక్కడ తెస్తున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? ట్రాక్ చేసే సిస్టమ్!
ఏపీలో చికెన్ షాపులకు కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర మంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది.
ఇకపై చికెన్ షాపుల్లో కొత్త విధానాలు రానున్నాయి. ఈ మేరకు చికెన్ దుకాణాల యజమానులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. చికెన్ బిజినెస్‌లో అక్రమాలను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇకపై ప్రతీ విషయం రికార్డ్ కానుంది. పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సంస్థ ఛైర్మన్ చంద్ర దండు ప్రకాష్‌నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డైరెక్టర్లు ప్రవీణ, అజ్ముద్దీన్, పశు సంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్‌నాయుడు, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
చికెన్ షాపులకు లైసెన్స్
చికెన్ దుకాణాలకు లైసెన్సింగ్ విధానాన్ని తీసుకోచ్చేందుకు రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం కచ్చితంగా ప్రతీ దుకాణానికి లైసెన్స్ తప్పనిసరి. అంతేకాదు.. ఏ ఫారం నుంచి కోళ్లు వచ్చాయో.. దుకాణదారుడు వాటిని ఎవరికి అమ్మారో అనే అంశాలు కూడా రికార్డు కానున్నాయి. అన్ని అంశాలు ట్రాక్ చేసేలా ఒక సిస్టమ్‌ను తీసుకురానుంది ప్రభుత్వం.
ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేపట్టి, అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. చికెన్, మటన్ దుకాణాలను క్రమబద్ధీకరించడం చేయాలి. అంతేకాదు గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచి హోటళ్ల నిర్వాహకులు మాంసం కొనేలా ప్రోత్సహించాలి. ఇంజెక్షన్స్ వాడిన కోళ్లను అమ్మడాన్ని పూర్తిగా నియంత్రించాలని రాష్ట్ర మంసాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలు ఏ రేంజ్‌లో వస్తాయో అందరికీ తెలిసిందే. వీటి ద్వారా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. అయితే దుకాణాల వ్యర్థాలను ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో డిస్పోజ్ చేసేలా ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం. చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లి చేపలకు ఆహారంగా వాడుతున్నవారిపై చర్యలు తీసుకోనుంది.
అక్రమ కబేళాలపై దాడులు నిర్వహించనుంది సంస్థ. ఇతర ప్రాంతాలకు గోవులను అక్రమగా తరలించకుండా చర్యలు తీసుకోనుంది. పీ 4 విధానంలో మాంసాభివృద్ధి సంస్థ ద్వారా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఒక్కో మోడల్ దుకాణం చొప్పున ఏర్పాటుకు చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలోని పశువుల సంతలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండనుంది. ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మంసాభివృద్ధి సంస్థ కార్యాచరణ రూపొందిస్తుంది.
News/Andhra Pradesh/చికెన్ దుకాణాలకు లైసెన్స్.. ఎక్కడ తెస్తున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? ట్రాక్ చేసే సిస్టమ్!
News/Andhra Pradesh/చికెన్ దుకాణాలకు లైసెన్స్.. ఎక్కడ తెస్తున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? ట్రాక్ చేసే సిస్టమ్!